Share News

గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్

ABN , Publish Date - May 28 , 2026 | 11:59 AM

భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్‌జైల్ నుంచి విడుదలయ్యారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారని అభినయ్ తెలిపారు.

గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా: అభినయ్ దర్శన్
Abhinay Darshan

అనకాపల్లి, మే 28: భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ఈరోజు(గురువారం) నర్సీపట్నం సబ్‌జైల్ నుంచి విడుదలయ్యారు. ​గత 8 రోజులుగా నర్సీపట్నం సబ్‌జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియా ముందుకు వచ్చిన అభినయ్.. ‘​నన్ను అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఎస్పీకి కృతజ్ఞతలు’ అని అన్నారు. ​పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారన్నారు. తనపై ఎవరూ చెయ్యి చేసుకోలేదరి, ఇన్వెస్టిగేషన్‌లో కూడా మర్యాదగా వ్యవహరించారని తెలిపారు. ​ఖైదీలు, పోలీసులు, జైలు సిబ్బంది ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని వెల్లడించారు.


​పాదయాత్ర ఆగిపోతుందంటూ వస్తున్న రూమర్స్‌పై అభినయ్ దర్శన్ స్పష్టతనిచ్చారు. ​గాయపడిన సింహం లాంటివాడిని, మరింత కసితో వేటాడతానని స్పష్టం చేశారు. ​పాదయాత్రకు ఎలాంటి విరామం లేదని, పాడేరు నియోజకవర్గం నుంచే యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ​గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ​ప్రజల కోసం, ప్రజా వ్యక్తిగా పోరాడటానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని అభినయ్ దర్శన్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఎంపీ శ్రీభరత్ నివాళులు

వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2026 | 12:04 PM