వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి
ABN , Publish Date - May 28 , 2026 | 11:02 AM
వడదెబ్బ బాధితుల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్, డాక్డర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు,18 బెడ్స్ ఉంటాయన్నారు.
విశాఖపట్నం, మే 28: వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్, డాక్డర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు,18 బెడ్స్ ఉంటాయన్నారు. క్రిటికల్ కేసుల కోసం భావనగర్, రాజేంద్రప్రసాద్ వార్డులలో మరికొన్ని బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు క్రిటికల్ కేసులు ఏవీరాలేదని చెప్పుకొచ్చారు. ఒకటి ఆరా కేసులు వచ్చినా వారికి తగిన చిక్సిత అందించి పంపిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలకు వడదెబ్బ ఎక్కువగా తగులుతుందని.. వీరు చాలా జాగత్తగా ఉండాలని సూచించారు.
వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కేజీహెచ్‌లో నాలుగు పాయింట్స్ వద్ద చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామని డాక్టర్ వెల్లడించారు. స్వచ్ఛమైన తాగునీరును అందుబాటులో ఉంచామన్నారు. దాహం వేసినా, వేయకపోయినా మంచినీళ్లు తాగాలని.. చల్లటి మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. ఎండాకాలంలో లేత వర్ణం దుస్తులు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే.. వడదెబ్బ తగలదని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఎంపీ శ్రీభరత్ నివాళులు
Read Latest AP News And Telugu News