ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - May 28 , 2026 | 10:40 AM
మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు.
ఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని ఓ పోస్టు పెట్టారు.
ఎన్టీఆర్ జీవితం తరతరాలకు స్ఫూర్తి..
‘మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలలుగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News