రెండో రోజు ఘనంగా ప్రారంభమైన మహానాడు

ABN, Publish Date - May 28 , 2026 | 10:11 AM

టీడీపీ మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది.

అమరావతి, మే 28: టీడీపీ మహానాడు- 2026 రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. షెడ్యూల్ కంటే 20 నిమిషాల ముందే కార్యక్రమం మొదలైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు మహానాడుకు హాజరయ్యారు.

Updated at - May 28 , 2026 | 10:13 AM