మెగా డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - May 31 , 2026 | 07:36 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
ప్రకాశం, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈరోజు (ఆదివారం) ప్రకాశం జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి కోసం మహానాడులో చర్చించామని అన్నారు. మహానాడు విజయవంతంగా జరగడం చూసి జగన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. కనీవినీ ఎరగని రీతిలో మహానాడుకి లైవ్‌లో 24 లక్షల మంది హాజరయ్యారని ప్రస్తావించారు.
ప్రపంచంలోనే మహానాడుది ఒక చరిత్ర..
ప్రపంచంలోనే మహానాడుది ఒక చరిత్ర అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్‌కి లేదని చెప్పారు. మెగా డీఎస్సీలో అర్హత సాధించిన వాళ్లు ఏడాది కాలంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. జగన్ నేర చరిత్ర, అవినీతి బయటకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ లిక్కర్ స్కాం బయటకు వచ్చినప్పుడు ఒకటి, అమరావతి గురించి మాట్లాడితే మావిగన్, మహానాడు జరుగుతుంటే డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తల్లినీ, చెల్లిని బయటకు గెంటేశారు..
వందల కోట్లు జగన్ పీఏకి ఎలా వచ్చాయని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. జైలు జీవితం కూడా అనుభవించిన వ్యక్తి జగన్... ప్రజలు ఈ విషయాలను కూడా గమనించాలని అన్నారు. అవినీతి పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. మహిళలు అంటే జగన్‌కి గౌరవం లేదని అన్నారు. తల్లినీ, చెల్లిని బయటకు గెంటేశారని ఆగ్రహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు
ఈ వార్తలు కూడా చదవండి...
విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!
పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News