ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతాయి: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:48 PM
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
ఢిల్లీ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (KishanReddy) వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోతాయని విమర్శించారు. ఈరోజు(శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు ఇండియా కూటమి నేతలు చెప్పలేకపోయారని పేర్కొన్నారు.
ఆ బిల్లులో కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి..
50 శాతం సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పామని, ఈ విషయంపై అన్ని పార్టీలతో తాము మాట్లాడామని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. లోక్‌సభలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు తెలియజేసే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని చెప్పిందని అన్నారు. ఇండియా కూటమి నేతలు కుట్ర చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల బిల్లును అడ్డుకున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ అనేకసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లులో ద్వంద్వ వైఖరి అవలంబించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 7 సార్లు బిల్లు పాస్ కాకుండా అడ్డుకుందని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ శివధర్ రెడ్డి
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం చారిత్రాత్మకం: రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టుపై మా ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News