Share News

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:44 AM

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం కానున్నారు. అందుకోసం లోక్‌ భవన్‌ (రాజ్ భవన్)కు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు.

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్.. ఎందుకంటే..?

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం కానున్నారు. అందుకోసం లోక్‌ భవన్‌ (రాజ్ భవన్)కు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు అజారుద్దీన్, ప్రొ. కోదండ రాం అప్రూవల్ విషయంపై గవర్నర్‌తో సీఎం రేవంత్ చర్చిస్తారు. గతంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొ. కోదండ రాం ఎన్నికయ్యారు. ఈ ఎన్నికపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.


కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రొ. కోదండ రాం తన ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. దాంతో మరోసారి ఆయన్ని గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో మైనార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను తన కేబినెట్‌లోకి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు.


అయితే అజారుద్దీన్.. శాసన సభలో కానీ.. శాసన మండలిలో కానీ సభ్యుడు కాదు. కానీ మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల లోపు ఈ ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో ఆయన సభ్యుడిగా ఉండాల్సి ఉంది. దాంతో అజారుద్దీన్‌ను కూడా గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపి ఎమ్మెల్సీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దాంతో వీరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా శాసన మండలికి పంపాలని ఈ సమావేశంలో శివ ప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:06 AM