గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:21 PM
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌లో ఈరోజు(ఆదివారం) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎంతో గవర్నర్ చర్చించారు. విద్యారంగానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు.
ఇందుకు సంబంధించి విద్యార్థులతో ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై సీఎంతో చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని సూచించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి
నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం
బయటకు వస్తే పులి సంగతి చెబుతాం.. కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And International News And Telugu News