Share News

క్రాస్ బ్రీడ్ ఎవరు..? కేటీఆర్‌పై సంజయ్ కుమార్ సెటైర్లు

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:53 PM

మాజీ మంత్రి కేటీఆర్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు తాను ఏనాడూ పోలేదని స్పష్టం చేశారు.

క్రాస్ బ్రీడ్ ఎవరు..? కేటీఆర్‌పై సంజయ్ కుమార్ సెటైర్లు
MLA Sanjay Kumar

జగిత్యాల, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై (KTR) జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు తాను ఏనాడూ పోలేదని స్పష్టం చేశారు. ఆయన కంటే తాను ఎందులోనూ తక్కువ కాదని తేల్చిచెప్పారు. ఈరోజు (ఆదివారం) జగిత్యాల వేదికగా సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తన కంటే ఆయనకు అహంకారం, అక్రమ సంపాదన మాత్రమే ఎక్కువని విమర్శించారు.


తన బ్రీడ్ కాదని.. ఆయన ఇంతకీ ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. క్రాస్ ఓటింగ్ చేయించిన ఆయనది క్రాస్ బ్రీడ్ అని ఎద్దేవా చేశారు. తాను రాజకీయ వ్యభిచారి అయితే.. నువ్వు వ్యభిచార కొంప నడిపావా..? అని సెటైర్లు గుప్పించారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి పలువురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని.. ఆయనదా క్రాస్ బ్రీడ్....? తమదా..? అని నిలదీశారు. కేటీఆర్ నీ అహంకారం, అక్రమ సంపాదన తన ముందు పని చేయవని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీజేపీ మిత్రపక్షాలకు భవిష్యత్తులో ఇబ్బందులే: సీఎం రేవంత్ రెడ్డి

నారీ శక్తికి కాంగ్రెస్ ద్రోహం చేసింది.. మహేశ్వర్ రెడ్డి ధ్వజం

బయటకు వస్తే పులి సంగతి చెబుతాం.. కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 19 , 2026 | 01:57 PM