జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయి: మంత్రి వివేక్
ABN , Publish Date - May 28 , 2026 | 01:08 PM
తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు.
మంచిర్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek Venkataswamy) వ్యాఖ్యానించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) చెన్నూరు మండలం బావురావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
హామాలీల కొరతతో ధాన్యం కొనుగోలులో ఆలస్యం..
పెద్దపల్లిలో మూడు గోడౌన్స్ అలాట్‌మెంట్ చేశామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. హామాలీల కొరతతో ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. సింగరేణి నుంచి 40 లారీలు, మైనింగ్ శాఖ నుంచి 40 లారీలను కేటాయించామని అన్నారు. మొత్తం 80 లారీలతో త్వరలోనే రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొని మిల్లులకు తరలిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
ఉనికి కోసమే బీజేపీ నాయకుల రైతు భరోసా యాత్ర: మంత్రి అడ్లూరి

ఉనికి కోసమే బీజేపీ నాయకుల రైతు భరోసా యాత్ర చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈరోజు (గురువారం) జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్లూరి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాలు పేరుతో దోచుకుంటున్నామని బీజేపీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు.
బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే భద్రాద్రి రాముడి ఆలయం ముందు మాట్లాడాలని మంత్రి అడ్లూరి సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం సరిగా లేకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సీఎం రేవంత్‌రెడ్డితో కలసి పనిచేద్దామని అన్నారని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో కేంద్ర మంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు నిధులను తీసుకురావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News