Share News

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ABN , Publish Date - May 27 , 2026 | 11:49 AM

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.


టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి..

కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను ఇతర అవసరమైన ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. రైతుల ధాన్యం భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే వాతావరణ కేంద్రం బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 27 , 2026 | 11:52 AM