కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్‌రావే.. కవిత ఘాటు వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:39 PM
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ అని ఆరోపించారామె.
హైదరాబాద్, జనవరి 27: బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు(Former MP Santosh Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన కామెంట్స్ చేశారు. సంతోష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్ దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్ రావు’ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావేనని ఆరోపించారు.
ఫాంహౌస్‌లో కేసీఆర్(Former CM KCR) ఫుల్ ఇడ్లీ తిన్నారా? సగం ఇడ్లీ తిన్నారా? అనే సమాచారాన్ని రేవంత్‌కు(CM Revanth Reddy) సంతోష్ చేరవేస్తాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు కవిత. బీఆర్ఎస్‌లో ఎందరో నేతలతో కన్నీళ్లు పెట్టించిన దుర్మార్గుడు సంతోష్ అని మండిపడ్డారు. ప్రగతి భవన్ గేటు బయట గద్దర్‌ను నిలబెట్టింది, ఈటల బీఆర్ఎస్ సస్పెండ్‌కు కారణం సంతోష్ రావే అని కవిత ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్‌ను ఉద్యమకారులకు, పేద ప్రజలకు దూరం చేశారని మండిపడ్డారు.
అలాంటి వ్యక్తికి అనుకూలంగా కేటీఆర్(KTR), హరీశ్ రావులు(Harish Rao) ట్వీట్లు పెట్టడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ గమనించుకోవాలని కవిత సూచించారు. బీఆర్ఎస్‌లో అన్ని దుర్మార్గాలకు కారణం సంతోష్ రావేనని ఆరోపించారు. గుంపు మేస్త్రీ రేవంత్ తన గూఢాచారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో కాపాడుకుంటాడని.. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయ పార్టీగా జాగృతి.. ఈసీకి కవిత దరఖాస్తు
సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్
Read Latest Telangana News And Telugu News