సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్‌ను తరలిస్తే ఊరుకునేది లేదు.. జగ్గారెడ్డి వార్నింగ్
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:50 AM
సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
సంగారెడ్డి, జనవరి 27: సంగారెడ్డి జిల్లాలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్(District Registrar), సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల తరలింపు విషయంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై ఆయన మండిపడ్డారు. అక్కడి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ‘ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం’ పేరుతో పఠాన్‌చెరు నియోజకవర్గం కర్ధనూర్‌కు తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా వ్యతిరేకించారు.
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తే ఊరుకోనని జగ్గారెడ్డి హెచ్చరించారు. అవసరమైతే అక్కడ ఉన్న పఠాన్‌చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పఠాన్‌చెరుకు తీసుకెళ్లవచ్చని సూచించారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో(Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడే వరకు ఎలాంటి తరలింపు ఆలోచన చేయవద్దన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ‘ఇది కేవలం సూచన కాదు.. హెచ్చరికగా పరిగణించాలి’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయ పార్టీగా జాగృతి.. ఈసీకి కవిత దరఖాస్తు
Read Latest Telangana News And Telugu News