US Strikes Venezuela: వెనెజువెలాపై యూఎస్ స్ట్రైక్.. ముందే చెప్పిన షామన్లు..
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:43 AM
వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకున్న అంశం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. రాత్రికి రాత్రే జరిగిన ఈ పరిణామంతో యావత్ ప్రపంచం షాక్ అయ్యింది. అయితే, ఈ ఆపరేషన్ గురించి ముందుగానే చెప్పారు షామన్లు.
ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రజ్యోతి: వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకున్న అంశం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. రాత్రికి రాత్రే జరిగిన ఈ పరిణామంతో యావత్ ప్రపంచం షాక్ అయ్యింది. అయితే, ఈ ఆపరేషన్ గురించి ముందుగానే చెప్పారు పెరూలోని షామన్లు. అవును, ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఈ అంశాన్ని ఘటనకు కొన్ని రోజుల ముందే చెప్పారు. కానీ, ప్రపంచమే పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అది నిజమవడంతో షామన్ల ప్రిడిక్షన్‌పై పెద్ద చర్చ నడుస్తోంది.
డిసెంబర్ 29వ తేదీన షామన్ల బృందం పెరూ రాజధాని లిమాలోని సముద్రం ఒడ్డున ఒక వార్షిక ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు రాబోయే సంవత్సరానికి సంబంధించి జోష్యం(ప్రిడిక్షన్) చెబుతారు. సాంప్రదాయ ఆండియన్ పోంచోలు, శిరస్త్రాణాలు ధరించి.. అంతర్జాతీయ సంబంధాల గమనం, కొనసాగుతున్న సంఘర్షణలు, ప్రపంచ దేశాల నాయకుల విధిని అంచనా వేస్తుంటారు. ఈ క్రమంలోనే.. వెనెజువెలా నాయకుడు మదురో భవిష్యత్‌ను కూడా షామన్లు చెప్పారు. మదురోను పదవి నుంచి తొలగిస్తారని.. ఆయనను తొలగించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోను పదవి నుంచి తొలగిస్తాడని ముందే గ్రహించాము. ఆయనను వెళ్లిపోవాలని.. పదవీ విరమణ చేయాలని కోరాము. వచ్చే ఏడాది ఇది జరుగుతుందని ముందే ఊహించాము.’ అని షామన్ అణా మారియా సిమియన్ తెలిపారు.
అయితే, వారి అంచనా పాక్షికంగానే నిజమైంది. వాస్తవానికి వారు మదురో పతనాన్ని మాత్రమే ఊహించారట. ట్రంప్ ఆయన్ను పదవి నుంచి తొలగించినప్పటికీ.. మదురో వారికి చిక్కకుండా పారిపోతాడని భావించారట. కానీ, మదురోను యూఎస్ భద్రతా బలగాలు బందీగా తీసుకున్నాయి. ‘నికోలస్ మదురో పతనాన్ని మేము చూస్తాము. వెనెజువెలా నుంచి ఆయన పారిపోతారు. అమెరికాకు పట్టుబడరు.’ అని షామన్ జువాన్ డి డియోస్ గార్సియా డిసెంబర్ 29న ప్రకటించారు. కానీ.. మదురోను, ఆయన భార్యను యూఎస్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
శనివారం నాడు వెనెజువెలా రాజధాని కారకాస్‌లోని సైనిక స్థావరంపై దాడి చేసిన అమెరికన్ భద్రతా బలగాలు.. అక్కడ ఉన్న మదురో ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులిద్దరిపై నార్కో టెర్రరిజం కుట్రలో పాల్గొన్నారనే అభియోగాలు మోపింది ట్రంప్ ప్రభుత్వం. అయితే, యూఎస్ చర్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ చర్యను పలు దేశాలు సమర్థిస్తుండగా.. మరికొన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సామ్రాజ్యవాద చర్యగా అభివర్ణిస్తున్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు..
యూఎస్-వెనెజువెలా ఇష్యూనే కాదు.. ఉక్రెయిన్-రష్యా వార్ గురించి కూడా షామన్లు ప్రిడిక్షన్ చెప్పారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ముగిసిపోతుందన్నారు. ఇరు దేశాలు శాంతి జెండాను ఎగురవేస్తాయని షామన్ గార్సియా చెప్పారు.
జరిగినవెన్ని.. జరగనవి ఎన్ని..
షామన్లు ప్రిడిక్షన్ ప్రతి ఏటా డిసెంబర్ చివరిలో నిర్వహిస్తారు. షామన్లు చెప్పే వార్షిక ప్రిడిక్షన్స్‌లో కొన్ని నిజమవడం, మరికొన్ని కాకుండా ఉన్నాయి. వాస్తవానికి 2023లోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిసిపోతుందని షామన్లు అంచనా వేశారు. కానీ, అది జరగలేదు. మానహ హక్కుల ఉల్లంఘనకు జైలు శిక్షణ అనుభవించిన పెరివియన్ మాజీ అధ్యక్షుడు ఆల్బర్టో ఫుజిమోరి 12 నెలల్లోపు చనిపోతారని షామన్లు అంచనా వేశారు. వారి అంచనా నిజమైంది. ఫుజిమోరి సెప్టెంబర్ 2024లో 86 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఇవేకాదు.. భూకంపాలు, వాతావరణ దృగ్విషయాలు వంటి ప్రకృతి వైపరిత్యాలను కూడా షామన్లు ఊహించి చెబుతుంటారు. మొత్తానికి వెనెజువెలా అధ్యక్షుడి విషయంలో వారు చెప్పింది నిజమవడంతో.. షామన్ల ప్రిడిక్షన్‌పై చర్చ మొదలైంది.
Also Read:
తండ్రైన స్టార్ తెలుగు క్రికెటర్.. !
రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన.. అప్పుడే పుట్టిన బిడ్డను దారుణంగా
ఫస్ట్‌టైం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇలా చేయడం బెస్ట్.!