Share News

Switzerland: న్యూ ఇయర్ వేళ విషాదం.. బార్‌లో భారీ పేలుడు..10 మంది మృతి!

ABN , Publish Date - Jan 01 , 2026 | 02:03 PM

న్యూ ఇయర్ వేడుకలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. సెలబ్రేషన్స్ కి వచ్చిన వాళ్లంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది.

Switzerland: న్యూ ఇయర్ వేళ విషాదం.. బార్‌లో భారీ పేలుడు..10 మంది మృతి!
New Year Bomb Blast

ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్ (Switzerland)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ - మోంటానా (Crans-Montana) లో న్యూ ఇయర్ వేడుకుల వేళ ఒక భారీ పేలుడు(Explosion incident) ఘటన విషాదం నింపింది. క్రాన్స్ -మోంటాలోని పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ‘లే కాన్ స్టేలేషన్’ (Le Constellation) అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అందరూ నూతన సంవత్సరం వేడుక(New Year celebration)ల్లో మునిగిపోయి ఉండగా, ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బార్‌లో సుమార్ 100 మంది వరకు ఉన్నట్లు సమాచారం.


హఠాత్తుగా బాంబ్ పేలుడు సంభవించడంతో జనాలు చెల్లాచెదురయ్యారు. భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. డజన్ల కొద్ది జనాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మందికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను తరలించడానికి హెలికాప్టర్లు, భారీ సంఖ్యల్లో అంబులెన్స్ లు వినియోగించి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, టపాసులు, ఫైర్ వర్క్స్ వల్ల జరిగిందా, గ్యాస్ లీకేజి వల్ల జరిగిందా? లేదా ఉగ్ర కోణం ఉందా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవీ చదవండి..

పెరిగిన ఎల్పీజీ ధరలు

తెలంగాణ భవన్‌కు కేటీఆర్..

Updated Date - Jan 01 , 2026 | 02:03 PM