Share News

LPG Cylinder Price: పెరిగిన ఎల్పీజీ ధరలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:40 AM

ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్యాస్ బండ ధరలు భారీగా పెరిగాయి.

LPG Cylinder Price: పెరిగిన ఎల్పీజీ ధరలు

న్యూఢిల్లీ, జనవరి 01: నూతన సంవత్సరం ప్రారంభం వేళ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలు భారీగా పెంచాయి. వాణిజ్య గాస్ సిలిండర్ ధర రూ.111 మేర పెరిగాయని ప్రకటించాయి. ఈ ధరలు ఈ రోజు నుంచి అంటే.. జనవరి 01 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఈ ధరల మార్పుతో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో సిలిండర్ ధర రూ.1691.50, వాణిజ్య రాజధాని రూ. 1642. 50, కోల్‌కతా రూ. 1795, చెన్నై రూ. 1,849గా ఉన్నాయి. పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరను తగ్గించినప్పటికీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను మాత్రం అమాంతంగా ఆయిల్ కంపెనీలు పెంచాయి.


గత 28 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర ఇంతగా ఎప్పుడూ పెరగలేదు. 2023, అక్టోబర్ తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఇంత భారీగా ఇప్పుడే పెరిగాయి. మరోవైపు ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. వీటి ధరలు న్యూఢిల్లీలో రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలోల రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది. 2025, ఏప్రిల్‌ నుంచి ఈ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ భవన్‌కు కేటీఆర్..

ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..

For More National News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 11:12 AM