Anti Corruption Drive: న్యూఇయర్ వేళ.. అధికారులు వినూత్న కార్యక్రమం
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:02 PM
నూతన సంవత్సర వేడుకలను హనుమకొండ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు.
వరంగల్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలను (New Year celebrations) హనుమకొండ కలెక్టరేట్‌లో (Hanumakonda Collectorate) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఒకరికొకరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన వినూత్న కార్యక్రమంలో అధికారులు పాలుపంచుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాధికారులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
హన్మకొండ కలెక్టరేట్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వాధికారుల సంతకాలు సేకరించారు. అవినీతికి వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీశ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం సరిపడా వేతనం ఇస్తోందని తెలిపారు. అధికారులు మంచి జీతంతో జీవితం గడపాలని సూచించారు. అవినీతిని ప్రోత్సహించొద్దని కలెక్టర్ స్నేహ శబరీశ్ కోరారు.
అవినీతి అంతం కోసం కలిసి రావాలి: సుంకరి ప్రశాంత్
దేశాభివృద్ధికి ప్రథమ శత్రువు ప్రభుత్వాధికారుల అవినీతినేనని జ్వాలా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రశాంత్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అవినీతి పెరుగుతునే ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు, అధికారులు, ప్రభుత్వం అవినీతి అంతం కోసం కలిసిరావాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పబ్బులపై ఈగల్ టీం సోదాలు.. డీజేలు అరెస్ట్..
ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
For More TG News And Telugu News