MP Raghunandan Rao: ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్
ABN , Publish Date - Jan 01 , 2026 | 03:42 PM
కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
సిద్దిపేట, జనవరి1 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP Medak MP Raghunandan Rao) డిమాండ్ చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. ఇవాళ(గురువారం) అక్బర్‌పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్‌లో ఎంపీ రఘునందన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓపెన్ జిమ్, బాలవికాస వాటర్ ప్లాంట్, సోలార్ స్ట్రీట్ లైట్లను సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్, పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంపీ రఘునందన్ రావు.
మహాత్మాగాంధీ కళలు కన్నా గ్రామస్వరాజ్యం సాధించాలని పాలకవర్గానికి సూచించారు. తన పార్లమెంట్ పరిధిలో ఎప్పుడు, ఏ సమస్య వచ్చిన 24 గంటలు తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. వ్యక్తిగత రీత్యా కూడా గ్రామపంచాయతీల ఏర్పాటుకు కృషి చేస్తానని మాటిచ్చారు. బొప్పాపూర్ గ్రామ పంచాయతీ, ఐకేపీ సెంటర్లో లైట్లు, రోడ్ల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటిపై సోలార్‌ను ఏర్పాటు చేసుకుని కరెంట్ ఆదా చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఎంపీ రఘునందన్ రావు.
మూడున్నరేళ్లలో సోలార్ నుంచి కరెంట్ తయారీ చేసేలా చూడాలని నిర్దేశించారు. ఎనగుర్తి నుంచి శిలాజీ నగర్ వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ‘మన ఊరు - మన బడి’ నిధుల్లేవని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పబ్బులపై ఈగల్ టీం సోదాలు.. డీజేలు అరెస్ట్..
ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News