Share News

Hyderabad: తాగారు.. చిక్కారు.. కూకట్‌పల్లిలో 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:07 AM

31వతేదీ రాత్రి, నిన్న తెల్లవారుజామున పోలీసులు పెద్దత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు పమోదు చేశారు. మద్యంతాగి వాహనాలు నడిపితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించినా.. మందుబాబులు ఏమాత్రం పట్టించుకోలేదు.

Hyderabad: తాగారు.. చిక్కారు.. కూకట్‌పల్లిలో 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

- ముందే హెచ్చరించిన పోలీసులు

- పట్టించుకోని ప్రజలు

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. ప్రమాదాల బారిన పడద్దొంటూ పోలీస్‌ యంత్రాం గం ఎంత చెప్పిన కొందరు పెడచెవిన పెట్టారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఫుల్‌గా మందు తాగారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. డిసెంబరు 31న జరిపిన వాహన తనిఖీల్లో కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పీఎస్‌(Kukatpally Traffic PS) పరిధిలో 67, కేపీహెచ్‌పీ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో 52, బాలానగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో 44, మొత్తం కూకట్‌పల్లి నియోజకవర్గంలో 163 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


అర్ధరాత్రి వరకు తనిఖీలు..

నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. కూకట్‌పల్లి నియోజక వర్గంలోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Kukatpally, KPHB, and Balanagar traffic police) బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో యువత, పెద్దలు మరింత జోష్‌తో మందు తాగారు. మందుబాబుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించారు.


city5.2.jpg

కూకట్‌పల్లి ట్రాఫిక్‌ సీఐ తిమ్మప్ప ఆధ్వర్యంలో కైత్లాపూర్‌తో పాటు, ముంబాయి జాతీయ రహదారిలో ఉన్న సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ చేపట్టారు. కైత్లాపూర్‌లో 28వాహనాలు, కూకట్‌పల్లి సౌత్‌ ఇండియా వద్ద 6 కార్లు, 1 ఆటో, 59 ద్విచక్రవాహనాలు మొత్తం 67 మంది వాహనదారులపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో జేఎన్‌టీయూ సర్కిల్‌ వద్ద, బాలానగర్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో నర్సాపూర్‌ చౌరస్తా, కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు. కేపీహెచ్‌బీలో 52, బాలానగర్‌లొ 44 మంది మందు తాగి పట్టుబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపకూడదని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 09:08 AM