Viral Video: కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. చివరకు సడన్‌గా..
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:03 PM
రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎప్పుడూ అనౌన్స్‌మెంట్ చేస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదృష్టం బాగుండి ప్రమాద సమయానికి పోలీసులు కాపాడుతున్న వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి.
నేటి సమాజంలో రోడ్డుపై ప్రమాదవశాత్తు పడిపోయి రక్తమోడుతుంటే.. ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీస్తూ షేర్ చేస్తున్నవాళ్లున్నారు. కానీ.. ఓ వ్యక్తి తన ప్రాణాలు అడ్డు వేసి ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడాడు. సాధారణంగా రైల్వే స్టేషన్ల (railway station)లో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కదులుతున్న రైలు (Rail) ఎక్కడం, దిగడం లేదా సమీపంలో ఉండటం చాలా ప్రమాదం. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ప్రమాదం జరిగే సమయానికి అదృష్టం కొద్ది రైల్వే పోలీసులు( Railway Police) వచ్చి రక్షిస్తున్న ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటన కర్ణాటక (Karnataka) లో చోటు చేసుకుంది. కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోతున్న ఓ ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి కాపాడిన స్టేషన్ మాస్టర్ (station master ) పై సర్వత్రా ప్రశంసలు (Praise) కురిపిస్తున్నారు. ఈ సంఘటనను సౌత్ వెస్ట్రన్ రైల్వే ( South Western Railway) ‘X’లో షేర్ చేసింది.
డిసెంబర్ 13, 2025 న కర్ణాటకలోని పాండవపుర రైల్వే స్టేషన్ (Pandavapura railway station)లో ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు (passenger) 16219 నంబర్ గల రైలు కదులుతున్నపుడు (Moving Rail) ఎక్కడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా పట్టు తప్పి కిందపడబోయాడు.. వెంటనే అక్కడికి స్టేషన్ మాస్టర్ అభిజిత్ సింగ్ (Abijit Singh) చేరుకొని అతన్ని బలంగా కొంత దూరం పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్టేషన్ మాస్టర్ ఒక్క సెకన్ ఆలస్యం చేసినా, ఆ ప్రయాణికుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేది. ఈ దృశ్యాలన్ని స్టేషన్ లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్(Viral) అవుతుంది. ప్రాణాలకు తెగించి కాపాడిన స్టేషన్ మాస్టర్ ధైర్యాన్ని మెచ్చుకుంటే నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.