Share News

నాడు లోక్‌సత్తా పార్టీ గుర్తు.. నేడు టీవీకే పార్టీకి..

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:36 PM

తమిళ హీరో విజయ్ పార్టీకి కేటాయించిన ‘విజిల్’ గుర్తుకు తెలుగు నేలతో మంచి అనుబంధం ఉంది. గతంలో తెలుగు నాట విజిల్ గుర్తు ‘లోక్‌సత్తా’ పార్టీకి కేటాయించింది ఎన్నికల సంఘం.

నాడు లోక్‌సత్తా పార్టీ గుర్తు.. నేడు టీవీకే పార్టీకి..
Lok Satta

ఇంటర్‌నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం తమిళ స్టార్ హీరో విజయ్‌కి చెందిన ‘తమిళగ వెట్రి కళగం(TVK)’ పార్టీకి గురువారం ‘విజిల్’ గుర్తును కేటాయించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజిల్ గుర్తు మీద పోటీ చేయనుంది. విజయ్ పార్టీకి కేటాయించిన ‘విజిల్’ గుర్తుకు తెలుగు నేలతో మంచి అనుబంధం ఉంది. గతంలో తెలుగు నాట విజిల్ గుర్తు ‘లోక్‌సత్తా’ పార్టీకి కేటాయించింది ఎన్నికల సంఘం. సామాజిక సంక్షేమం, రాజకీయ సంస్కరణలే లక్ష్యంగా మాజీ ఐఏఎస్ అధికారి డా.జయప్రకాశ్ నారాయణ్ 2006లో లోక్ సత్తా పార్టీని స్థాపించారు.


2006 డిసెంబర్ 22వ తేదీన అధికారికంగా పార్టీ రిజిస్ట్రేషన్ జరిగింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు లోక్‌ సత్తా పార్టీకి ఈసీ విజిల్ గుర్తు కేటాయించింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీ తరఫున విజిల్ గుర్తుపై పోటీ చేసిన జయప్రకాశ్ నారాయణ్ విజయం సాధించారు. ఆయన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ప్రస్తుతం.. ఆ పార్టీ క్రియాశీల రాజకీయాల్లో లేకపోయినా.. ఇప్పటికీ విజిల్ గుర్తు అంటే ముందుగా లోక్ సత్తానే గుర్తుకొస్తుంది.


ఇవి కూడా చదవండి

భారత్‌లో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేదే లేదు: బీసీబీ

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

Updated Date - Jan 22 , 2026 | 05:59 PM