Share News

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:57 PM

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం
BMC

ముంబై: ముంబైకి మహిళా మేయర్ రానున్నారు. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ పోస్టును ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ ప్రక్రియను పట్టణాభివృద్ధి శాఖ గురువారం నాడు నిర్వహించింది. ఫలితాల్లో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బాయ్‌కాట్ చేసింది.


లాటరీ నిర్వహించిన పద్ధతిపై శివసేన యూబీటీ నేత, ముంబై మాజీ మేయర్ కిషోర్ ఫడ్నేకర్ తప్పుబట్టారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని అన్నారు. బీఎంసీని ఎందుకు ఓబీసీ కేటగిరీ కింద పరిగణించలేదని ప్రశ్నించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రూల్స్ మార్పు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లాటరీ పద్ధతిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడా ఎస్టీ కేటగిరికి మేయర్ పోస్టు దక్కకపోవడాన్ని కూడా ఆ పార్టీ తప్పుపట్టింది.


ఫలితాలివే..

లాటరీ పద్ధతిలో కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేష్ ఎస్సీలకు కేటాయింపు జరిగింది. థానే మేయర్ పోస్టు ఎస్సీ కేటగిరీ (పురుషుడు)కి రిజర్వ్ అయింది. జల్సా-ఎస్సీ-పురుష, లూతూర్-ఏస్సీ-పురుష, ఇచల్కరంజీ-ఓబీసీ-పురుష, పాన్వెల్-ఓబీసీ-పురుష, అకోలా- ఓబీసీ-పురుష, అహిల్యానగర్-ఓబీసీ-మహిళ, ఉల్హాస్‌నగర్-ఓబీసీ-పురుష, కొల్హాపూర్-ఓబీసీ-పురుష, చంద్రపూర్-ఓబీసీ-మహిళ, జలగావ్-ఓబీసీ-మహిళకు రిజర్వ్ అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు: రాహుల్

తమిళ హీరో విజయ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ

Read Latest National News

Updated Date - Jan 22 , 2026 | 05:40 PM