భారత్‌లో టీ20 ప్రపంచ కప్ 2026 ఆడేదే లేదు: బీసీబీ
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:16 PM
టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచులను భారత్‌లో ఆడేదేలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. వేదికలను మార్చితేనే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచులను భారత్‌లో ఆడేదేలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) స్పష్టం చేసింది. వేదికలను మారిస్తేనే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. గురువారం ఢాకాలో బంగ్లాదేశ్ క్రీడా సలహాదారులు ఆసిఫ్ నజ్రూల్, ప్రపంచ కప్‌నకు ఎంపికైన బంగ్లా ప్లేయర్ల మధ్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఆడేదే లేదని స్పష్టం చేశారు.
భద్రతా దృష్ట్యా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే బంగ్లాదేశ్.. ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ సైతం ఘాటుగానే స్పందించింది. బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచ కప్ మ్యాచులను భారత్‌లో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. దీంతో చివరిసారిగా తన నిర్ణయాన్ని బీసీబీ గురువారం వెల్లడించింది. తాము ఆడే మ్యాచుల వేదికలు మారిస్తే.. తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని ఆసిఫ్ పేర్కొన్నారు. బీసీబీ తాజా నిర్ణయంతో ప్రపంచ కప్ 2026లో బంగ్లా జట్టు ఆడటంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
అసలేం జరిగిందంటే..
ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ తొలగించడంతో ఇరుదేశాల మధ్య వివాదం మొదలైంది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముస్తాఫిజుర్‌ను వదులుకుంది. దీంతో భారత్‌పై ఆగ్రహం పెంచుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిషేధించింది. అంతేకాక ఇకపై బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడించకూడదని నిర్ణయించుకుంది. వీటితో పాటు వచ్చేనెలలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలోనూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరో డిమాండ్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో జరిగే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. దీంతో తాజాగా తన తుది నిర్ణయాన్ని తాజాగా బంగ్లాదేశ్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్