Share News

TG Politics: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:03 PM

బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నదీ జలాల విషయంలో మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నదీ జలాలు, ప్రాజెక్టులపై..

TG Politics: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్..
Revanth Reddy challenge KCR

హైదరాబాద్, డిసెంబర్ 18: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నదీ జలాల విషయంలో మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నదీ జలాలు, ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి అంటూ కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతానని అన్నారు. బురదజల్లి పారిపోవడం కాదు.. నీటి వాటాల్లో ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. ‘కృష్ణా జలాలపై ప్రతిపక్ష నేతగా లేఖ రాయండి. కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ ద్రోహం చేశారు. మీరు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం.’ అని రేవంత్ అన్నారు.


తెలంగాణలో పంచాయతీ ఎన్నిక పోరు ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. పెద్ద సంఖ్యలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైనా కీలక కామెంట్స్ చేశారు.


కేటీఆర్ వచ్చాక బీఆర్ఎస్ గెలవలేదు..

కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను తప్పించాలని హరీష్ రావు వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టిందని.. అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారని అన్నారు. ఇదిలాఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసుపైనా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు. అరవింద్ కుమార్‌కు సంబంధించి అనుమతి రావాల్సి ఉందన్నారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మెస్సీ ఈవెంట్‌ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని సీఎం స్పష్టం చేశారు. మెస్సీ ఈవెంట్‌కు తాను గెస్ట్ మాత్రమేనని చెప్పారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చిందన్నారు. ఫుట్‌బాల్‌ ఆడించాలనే తన మనవడిని తీసుకెళ్లినట్లు సీఎం వివరించారు. తాము పబ్బులు, గబ్బుల చుట్టూ తిప్పలేదన్నారు.


Also Read:

ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం

మూగ జీవాలకు ఆహారం పెడితే.. కలిగే ప్రయోజనాలు..

పంచాయితీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం..

Updated Date - Dec 18 , 2025 | 06:12 PM