Share News

PM Modi: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం

ABN , Publish Date - Dec 18 , 2025 | 05:59 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

PM Modi: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ఒమన్ అత్యున్నత పురస్కారం
PM Modi Oman highest award

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఒమన్ దేశం కూడా తన అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించడం విశేషం (PM Modi Oman highest award).


ప్రధాని మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత్, ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్.. మోదీకి 'ఆర్డర్ ఆఫ్ ఒమన్' పురస్కారాన్ని ప్రదానం చేశారు. 'ఆర్డర్ ఆఫ్ ఒమన్' అనేది ఒమన్, విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం (Modi foreign honours).


భారత్ - ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు (India Oman relations). కాగా, ప్రధాని మోదీ ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా 'ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్'తో ఆయనను గౌరవించింది. బుధవారం ఇథియోపియా తన అత్యున్నత పురస్కారమైన 'నిషాన్ ఆఫ్ ఇథియోపియా'తో ప్రధాని మోదీని సత్కరించింది.


Also Read:

Jogi Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట

Thyroid Treatment: పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?

Updated Date - Dec 18 , 2025 | 05:59 PM