Jogi Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:15 PM
నెల్లూరు జిల్లా కోర్టు నుంచి తమను విజయవాడ కోర్టును మార్చాలంటూ జోగి రమేష్ బ్రదర్స్ పెట్టుకున్న పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు మరికాసేపట్లో విచారించనుంది.
అమరావతి, డిసెంబర్ 18: నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు ఊరట లభించలేదు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను ఎక్సైజ్ కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు.. బాదల్ దాస్ (A7), ప్రదీప్ దాస్ ( A8), కళ్యాణ్ ( A12), రవి (A4), శ్రీనివాస్ తిరుమలశెట్టి (A13), శ్రీనివాస్ రెడ్డి (A11), సతీష్ (A17) లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి శ్రీరాములు, అద్దేపల్లి జనార్దన్ రావు (A1)తోపాటు ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు (A2)తోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ కోసం వీరు ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపిన కోర్టు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఈ నలుగురికి తప్పించి.. మిగిలిన ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి బ్రదర్స్‌కు జోగి బ్రదర్స్ అండగా ఉండి ప్రోత్సహించినట్లు కోర్టుకు ఆధారాలను ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే అందజేశారు.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కోర్టు ఈ నలుగురి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురికి ఈ రోజుతో రిమాండ్ ముగియనుంది. దాంతో వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు పోలీసులు వీరిని హజరుపరిచారు. డిసెంబర్ 31వ తేదీ వరకు వారి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
అయితే తమను నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు మార్చాలంటూ వీరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం విచారిస్తామని ఎక్సైజ్ కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై సీఎం చంద్రబాబు రియాక్షన్
అందుకే మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాం: కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News