BRS MLAs Meet: నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:23 AM
ఇవాళ(శనివారం)తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఉదయం 10గంటలకు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశంకానున్నారు. కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్, జనవరి 3: ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఉదయం 10గంటలకు కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS political strategy) సమావేశం కానున్నారు. కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. నేడు(శనివారం) కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్‌ఎస్(BRS Assembly boycott reasons) ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్‌లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రభుత్వ వైఖరిపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఏడు మార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్‌ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా.. మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల