Share News

CP Sajjanar: ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా..

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:44 AM

ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనుకూడా జిమ్‌లో జాయిన్‌ అవుతా.. అంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ అన్నారు. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో సిబ్బందికి సూచన చేస్తూ పోస్టు చేశారు.

CP Sajjanar: ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడొద్దు.. త్వరలో నేనూ జిమ్‌లో జాయిన్‌ అవుతా..

- 2026 ప్రణాళికను ఎక్స్‌లో పోస్టు చేసిన సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: పోలీసులు ఉద్యోగ విధులను, ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకోవాలని, ఫిట్‌నెస్‌ విషయంలో రాజీ పడొద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌(Hyderabad Police Commissioner V.C. Sajjanar) పేర్కొన్నారు. ఈ మేరకు 2026 సంవత్సరంలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను, నేరనియంత్రణకు సిద్ధం చేసిన ప్రణాళికలను ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు.


‘చాలాకాలంగా ఫిట్‌నెస్ కోసం (వ్యాయామం) జిమ్‌కు వెళ్లాలని అనుకున్నాను. కానీ పని ఒత్తిడి వల్ల కుదరలేదు.. ఇకపై ఆరోగ్యం విషయంలో రాజీపడేదిలేదు. త్వరలోనే జిమ్‌లో చేరుతా..’ అని సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. పుస్తక పఠనానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని, అన్నింటికంటే ముఖ్యంగా.. కుటుంబ సభ్యులు, మిత్రులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.


city1.2.jpg

అదేసమయంలో మా సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు కూడా నాకు అంతే ముఖ్యమని, వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవడం మా ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ఒక పోలీసు అధికారిగా.. నగరాన్ని మరింత సురక్షితంగా, భద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా (గ్లోబల్‌ అవుట్‌ లుక్‌) తీర్చిదిద్దడంలో అర్థవంతమైన పాత్ర పోషించడమే నా ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు

ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Jan 03 , 2026 | 06:44 AM