TG Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. చర్చలో పాల్గొంటారా? వెంటనే వెళ్లిపోతారా?
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:36 PM
సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష కేసీఆర్ హాజరవనున్నారా? సభలో కృష్ణా జలాలపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారా? అంటే అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
హైదరాబాద్, డిసెంబర్ 28: సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష కేసీఆర్ హాజరవనున్నారా? సభలో కృష్ణా జలాలపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారా? అంటే అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడతారు అని గులాబీ నేతలు చెబుతున్నారు. వాళ్లు చెప్పడమే కాదు.. కేసీఆర్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. సోమవారం ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి వెళతారు కేసీఆర్. మొదటి రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాగా, కేసీఆర్ ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి, రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్.
ఉంటారా? వెంటనే వెళ్తారా?
కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటున్న కేసీఆర్.. ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనే అంశంపై హాట్ డిస్కషన్‌గా మారింది. కేసీఆర్ అసెంబ్లీ వచ్చినా.. చర్చలో పాల్గొంటారా? లేక సంతకం పెట్టి వెళ్లిపోతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సమావేశాలో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై, ప్రాజెక్టుల అంశంపై చర్చించేందుకు సిద్ధమని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు అసెంబ్లీలో సీన్ వేరే లెవల్‌లో ఉండనుందని అందరూ అంచనా వేస్తున్నారు. నిజంగానే కేసీఆర్ ఈ డిబేట్‌లో పాల్గొంటే.. అసెంబ్లీ హాట్ హాట్ కామెంట్స్‌లో దుమ్ములేసిపోవడం ఖాయం అంటున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోతే.. కాంగ్రెస్ పార్టీకి మరో ఆయుధం చిక్కినట్లవుతుందని చెబుతున్నారు. మరి కేసీఆర్ సభకు వచ్చి.. చర్చలో పాల్గొంటారా? లేక ఎప్పటిలాగే సంతకం పెట్టి అటునుంచి అటే వెళ్లిపోతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read:
Harbhajan Singh: ఎత్తులో చిన్నవాడే కానీ షాట్లు మాత్రం పెద్దవి.. ఇషాన్ కిషన్‌పై భజ్జీ ప్రశంసల జల్లు
TVK Chief Vijay: నటుడు, TVK అధినేత విజయ్ కీలక నిర్ణయం.. 30 ఏళ్లు నిలబడతానంటూ..