Harbhajan Singh: ఎత్తులో చిన్నవాడే కానీ షాట్లు మాత్రం పెద్దవి.. ఇషాన్ కిషన్‌పై భజ్జీ ప్రశంసల జల్లు
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:29 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దేశవాళీల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున సెంచరీ బాది తొలి సారి టైటిల్ అందించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు శతకం బాదాడు. ఈ సందర్భంగా అతడి ఫామ్‌పై దిగ్గజ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇషాన్ కిషన్.. ప్రస్తుతం దేశవాళీల్లో ఆడుతున్న ఇతడి ప్రదర్శనకు, ఫామ్‌కు ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర పట్టడం లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్‌లో శతక్కొట్టి.. జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ 33 బంతుల్లో సెంచరీ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 125 పరుగులు చేసిన కిషన్ ఏకంగా 14 సిక్సులు, 7 ఫోర్లు బాదాడు. ఈ ప్రదర్శనపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ప్రశంసల జల్లు కురిపించాడు.
‘ఇషాన్(Ishan Kishan) ఎత్తులో చిన్నవాడే కానీ.. షాట్లు మాత్రం చాలా పెద్దవి. అతడి ప్రతిభను నేను గతంలోనే గుర్తించా. ఒక బంతిని నెమ్మదిగా వేసాను. అతను లేటుగా ఆడి కవర్స్ వైపు ఫోర్ కొట్టాడు. వెంటనే అనుకున్నా.. ఇక నెమ్మదిగా వేయకూడదని. తర్వాత బంతి కాస్త తడి ఉన్నా ఫుల్ స్పీడ్‌తో వేశాను. కానీ బంతి చేతి నుంచి విడిచిన క్షణంలోనే అతను మోకాలి మీద కూర్చొని రివర్స్ స్వీప్ ఆడేశాడు. అది ఇప్పటికీ గుర్తుంది. నా బౌలింగ్‌లో స్విచ్ హిట్.. ఇషాన్ కంటే మెరుగ్గా కెవిన్ పీటర్సన్ కూడా కొట్టలేదు. ఇది ఒక స్పెషల్ టాలెంట్ అని అతడితో చెప్పా. కొంతకాలం పలు కారణాల వల్ల టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్.. తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అతడి వయసు చిన్నదే కావొచ్చు కానీ చాలా పరిపక్వతతో ఆడతాడు’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు