Pakistan: సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు
ABN , Publish Date - Dec 28 , 2025 | 02:30 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించారు. అయితే ఈ మెగా టోర్నీ(T20 World Cup 2026)కి సన్నాహకంగా జనవరి 7 నుంచి శ్రీలంకతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచుల కోసం పాక్ సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్న స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్‌లను లంకతో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అన్‌క్యాప్‌డ్ వికెట్ కీపర్ ఖవాజా నఫేను తొలిసారి జాతీయ జట్టులోకి తీసుకున్నారు.
నఫే ఇటీవల పాకిస్తాన్ షహీన్స్ జట్టులో భాగమయ్యాడు. ఇప్పటి వరకు 32 టీ20లు ఆడి 132.81 స్ట్రైక్ రేట్‌తో 688 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి టీ20లో జట్టులో చోటు సంపాదించుకున్నాడు. సల్మాన్ అఘా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే జట్టు ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్‌నకు పాకిస్తాన్ టీమ్‌ను ఖరారు చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ బిలో భారత్, పాక్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్‌ఏ ఉన్నాయి. పాకిస్థాన్ మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.
శ్రీలంకతో సిరీస్‌కు పాక్ జట్టు:
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తరీక్.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్