Share News

National Senior Badminton Championship: ఫైనల్లో చరిష్మా, గీతన్వి

ABN , Publish Date - Dec 28 , 2025 | 06:12 AM

తెలుగమ్మాయి సూర్య చరిష్మా జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో తన దూకుడు కొనసాగిస్తోంది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ ఉన్నతి హుడాకు షాకిచ్చి...

National Senior Badminton Championship: ఫైనల్లో చరిష్మా, గీతన్వి

సెమీస్‌లో తరుణ్‌, కిరణ్‌ అవుట్‌

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌

విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): తెలుగమ్మాయి సూర్య చరిష్మా జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో తన దూకుడు కొనసాగిస్తోంది. క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ ఉన్నతి హుడాకు షాకిచ్చి సంచలనం సృష్టించిన చరిష్మా.. అదే జోరులో సెమీఫైనల్‌ను కూడా విజయవంతంగా దాటేసింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో చరిష్మా 21-18, 18-21, 21-9తో ప్రపంచ 45వ ర్యాంకర్‌ రక్షితశ్రీని ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో తన్వి పత్రితో చరిష్మా అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో తన్వి 18-21, 21-12, 21-15తో శ్రుతిపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ కిరణ్‌ జార్జ్‌, తెలుగు షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లిలకు చుక్కెదురైంది. సెమీఫైనల్స్‌లో రిత్విక్‌ సంజీవి 21-16, 17-21, 22-20తో కిరణ్‌ జార్జ్‌పై, భరత్‌ రాఘవ్‌ 21-17, 11-21, 21-11తో తరుణ్‌పై గెలుపొంది తుదిపోరులో ముఖాముఖికి సిద్ధమయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌సీడ్‌ జోడీ ఆషిత్‌ సూర్య/అమృత 8-21, 21-18, 21-18తో మూడోసీడ్‌ జంట దీప్‌/సోనాలిపై, రెండోసీడ్‌ ద్వయం సాత్విక్‌ రెడ్డి/రాధిక 21-13, 21-15తో నితిన్‌/కనిక జోడీపై నెగ్గి ఫైనల్‌ చేరారు. మహిళల డబుల్స్‌లో మాజీ చాంపియన్‌ శిఖా గౌతమ్‌/అశ్విని భట్‌, ప్రియా దేవి/శ్రుతి మిశ్రా ఫైనల్‌కు దూసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!

ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్

Updated Date - Dec 28 , 2025 | 06:12 AM