FIDE World Rapid Championship: టాప్‌లో హంపి
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:09 AM
ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి టాప్‌లో కొనసాగుతోంది. మహిళల విభాగంలో మొత్తం ఎనిమిది రౌండ్‌లు ముగిసే సరికి డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి...
ఫిడే ప్రపంచ చాంపియన్‌షిప్
దోహా: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి టాప్‌లో కొనసాగుతోంది. మహిళల విభాగంలో మొత్తం ఎనిమిది రౌండ్‌లు ముగిసే సరికి డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి (6.5), ఝు జినెర్ (6.5)తో కలిసి అగ్ర స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన నాలుగు గేమ్‌లలో..హంపి మూడు నెగ్గి మరొకటి డ్రా చేసుకుంది. మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఓపెన్ కేటగిరీలో తొమ్మిది రౌండ్‌లు ముగిసే సరికి భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేష్, అర్జున్ ఇరిగేసి చెరో 6.5 పాయింట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. రెండోరోజు..నాలుగు రౌండ్‌లలో ఒక మ్యాచ్‌లో నెగ్గిన అర్జున్ మరో రెండు గేమ్‌లను డ్రా చేసుకొన్నాడు. మరో గేమ్‌లో పరాజయం చవిచూశాడు. ఇక ప్రపంచ చాంపియన్ గుకేష్ ఒక రౌండ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. మిగిలిన రెండు గేమ్‌లను డ్రాగా ముగించాడు.
ఇవి కూడా చదవండి
తనను ఔట్ చేసిన బౌలర్‌కు విరాట్ అదిరిపోయే గిఫ్ట్!
ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్