Share News

BCCI: ‘టెస్టు’ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ క్లారిటీ!

ABN , Publish Date - Dec 28 , 2025 | 03:53 PM

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి టెస్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ.. ఆ వార్తలను ఖండించింది.

BCCI: ‘టెస్టు’ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ క్లారిటీ!
BCCI

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలోనే న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడంతో గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటి నడుమ అన్ని ఫార్మాట్ల కోచ్‌గా ఉన్న గంభీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేస్తారంటూ వార్తలూ వచ్చాయి. టెస్టుల్లో అతడి పనితీరు సరిగ్గా లేదని.. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌పై దృష్టి పెడుతుందని.. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో చర్చలు జరిపిందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. టెస్ట్ కోచ్ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ(BCCI) ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు.


‘గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir )ను మారుస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ పుకార్లే. ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. కాంట్రాక్ట్ ప్రకారం గంభీర్ కొనసాగుతాడు. మేం ఎవరినీ సంప్రదించలేదు. గంభీర్‌తో కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకూ ఉంది. కోచింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగవు. గంభీర్‌పై మాకు నమ్మకం ఉంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో కూడా అర్థం కావడం లేదు. ఎంతో నమ్మకమైన న్యూస్ ఏజెన్సీలు కూడా ఇలాంటివి ప్రచురితం చేయడం పద్ధతి కాదు. బయట ప్రజలు తమకు తోచిన విధంగా ఆలోచిస్తుంటారు. బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇదంతా ఎవరో కల్పించిన ఊహాజనితమైన వార్త’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు

Updated Date - Dec 28 , 2025 | 03:53 PM