Home » VVS Laxman
ఆసియా క్రీడల్లో తలపడే భారత టీ20 క్రికెట్ జట్టుకు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈమేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
ఆసియా క్రీడలు 2026లో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు కేంద్ర క్రీడల శాఖ ఆమోదం తెలిపింది.
ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా మారింది. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) వెనుక బీసీసీఐ మాజీ కార్యదర్శి, ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం.
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి వరుస గాయాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ) హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆల్‌రౌండర్‌గా నితీశ్‌పై అధికంగా ఉండే వర్క్‌లోడ్‌ను ఎలా సమర్థంగా నిర్వహించాలో అతడితో చర్చిస్తున్నామని చెప్పాడు.
భారత హెడ్ కోచ్ పదవిపై మాజీ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే తనకు భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిందని.. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని స్వీకరించలేకపోయానని వెల్లడించాడు.
గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటున్న వేళ.. బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి టెస్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనిపై స్పందించిన బీసీసీఐ.. ఆ వార్తలను ఖండించింది.