TVK Chief Vijay: నటుడు, TVK అధినేత విజయ్ కీలక నిర్ణయం.. 30 ఏళ్లు నిలబడతానంటూ..
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:10 PM
తమిళ నటుడు, టీవీకే అధినేత దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయగన్ సినిమా ఆడియో విడుదల వేడుక మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..
తమిళ నటుడు, టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినీ ప్రస్థానానికి పూర్తిగా స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. జన నాయగన్ అనే సినిమానే తన ఆఖరి చిత్రమని అధికారికంగా ప్రకటించారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయగన్ సినిమా ఆడియో విడుదల వేడుక మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌కి ఈ సినిమా చివరి చిత్రం కావడంతో అభిమానులు ఈ వేడుకకు పెద్దఎత్తున హాజరయ్యారు. ఇది మలేషియా రికార్డ్ బుక్‌లో కూడా చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తాను ఇసుకతో చిన్న ఇల్లు కట్టుకుందామని సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. అయితే అభిమానులు తనకు రాజమహల్ ఇచ్చారని తెలిపారు. తన కోసం ఎంతోమంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారని.. ఇంతకాలం సపోర్ట్ చేసిన అందరి కోసం మరో 30 ఏళ్ల పాటు తాను నిలబడతానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడం కోసమే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇకపై పూర్తిగా ప్రజా సేవకే తన సమయం కేటాయించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా విజయ్.. తన ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుతూ ఎమోషనల్ అయ్యారు. విజయ్ ప్రసంగానికి అభిమానుల కళ్లు కూడా చెమర్చాయి. దళపతి విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతున్నారు. 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ నామినేషన్! చేతులను తాళ్లతో కట్టేసి తీసుకొచ్చిన పోలీసులు
గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..