Minister Uttam Kumar Reddy: కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష.. ధాన్యం కొనుగోళ్లపై దిశా నిర్దేశం
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:04 PM
ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకార్యాలు కలిపించాలని సూచించారు.
హైదరాబాద్: సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ వానాకాలంలో రికార్డ్ స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. అధిక దిగుబడి, అధిక కొనుగోళ్ల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకార్యాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న రవాణా వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతులు ఎక్కడ కుడా నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన అంశంలో అత్యవసరం అనుకుంటే అదనపు ఖర్చులకు వెనకాడ వద్దని వివరించారు.
ధాన్యం కొనుగోలు వివరాలను సత్వరమే నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నమోదు అయిన కొనుగోళ్లకు 48 గంటలలో చెల్లింపులు జరగాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు అందరూ.. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ముందుకు వెళ్లాలని సూచించారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
Data Center : అమెరికా బయట భారీ పెట్టుబడి రామ్మోహన్