The Supreme Court has directed: ఇందిరా టెలివిజన్ కేసులో కౌంటర్ వేయండి
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:01 AM
ఏపీలో ఇందిరా టెలివిజన్(జగన్ టీవీ) ప్రసారాల నిలిపివేత కేసులో కౌంటర్ దాఖలు చేయాలని.....
రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీలో ఇందిరా టెలివిజన్(జగన్ టీవీ) ప్రసారాల నిలిపివేత కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా తమ టీవీ ప్రసారాలు నిలిపివేశారని ఈ ఏడాది జూలై 19న ఇందిరా టెలివిజన్ వేసిన రిట్ పిటిషన్ మంగళవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌తో కూడిన ధర్మాస నం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ టీవీ ప్రసారాలను పూర్తిగా అడ్డుకుంటోందన్నారు. గతంలోనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణలోపు కౌంటర్ వేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను నవంబరు 25కు వాయిదా వేసింది.