Share News

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:09 PM

మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది.

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు
Central Government

ఢిల్లీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మెటా గ్లోబల్ (Meta Global) బృందానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది. సిస్టమ్స్ అనుకున్న రీతిలోనే సమర్థవంతంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మెటాదేనని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక ఖాతా పోస్ట్‌ను ఆటోమేటెడ్ సిస్టమ్స్ డిలీట్ చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా ఇండియా పాలసీ టీమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికాలోని గ్లోబల్ లీడర్‌షిప్‌ను నేరుగా ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


కేవలం 'సాంకేతిక లోపం' అని తప్పించుకోలేరని కేంద్రం తెలిపింది. కంటెంట్ మోడరేషన్ సాఫ్ట్‌వేర్‌పై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారత చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందేనని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల భద్రత, వాట్సాప్ కొత్త ఫీచర్లతో వచ్చే సైబర్ ముప్పులపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో 'డీప్‌ఫేక్', ఏఐ (AI) నకిలీ కంటెంట్ నిరోధక చర్యలపై మెటాను కేంద్రం ప్రశ్నించనుంది.


వార్తలు కూడా చదవండి...

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 02:45 PM