Share News

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:01 PM

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు.

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్​ డైరెక్టర్​ రాహుల్​ దేవరాజ్​‌తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని వ్యాఖ్యానించారు.


నిమ్స్​‌లో ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని సీఎం పేర్కొన్నారు. ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందని చెప్పుకొచ్చారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.


ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు: దామోదర

Thalassemia

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ (Telangana Minister Damodara Rajanarasimha) వ్యాఖ్యానించారు. ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి దామోదర అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను నిమ్స్ పూర్తి చేసిందని వెల్లడించారు.


దక్షిణ భారత ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ను నిమ్స్ చేసిందని మంత్రి దామోదర చెప్పుకొచ్చారు. 90 శాతానికి పైగా రొబోటిక్ సర్జరీలు ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితమని తెలిపారు. యూరాలజీలో 590, గ్యాస్ట్రోలో 248, ఆంకాలజీలో 162 రొబోటిక్ సర్జరీలు జరుగుతాయని వివరించారు. ఎంఎన్‌జేలోనూ విజయవంతంగా రొబోటిక్ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త టిమ్స్, గాంధీ, ఉస్మానియాలో రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 04:23 PM