Share News

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం

ABN , Publish Date - Aug 02 , 2026 | 04:05 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
KTR

హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కామెంట్స్‌పై ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతుంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే.. అలాంటి వారిని ‘క్రిమినల్ వేస్ట్’ అని రేవంత్‌రెడ్డి అనడం తగదని అన్నారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని అందిస్తున్న ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం చేసిన కామెంట్స్‌పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని చెప్పుకొచ్చారు.


null

ఆ పార్టీ మెడలు ఎలా వంచుతారో రాహుల్ గుర్తుంచుకోవాలి..

రాహుల్ గాంధీ ఈ అంశంలో మౌనంగా ఉండటమంటే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డితో వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. యువత రేపటి భారతదేశ నిర్మాతలు అనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అన్నారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మకి, ఇందిరమ్మ ఎమర్జెన్సీ సమయంలో, యుపీఏ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుసునని ప్రస్తావించారు. యువత తలుచుకుంటే ఆ పార్టీ మెడలు ఎలా వంచుతారో రాహుల్ గుర్తుంచుకోవాలని అన్నారు. తెలంగాణ యువత ఓట్లు అడిగి వారిని మభ్యపెట్టిన రాహుల్ గాంధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నానని స్పష్టం చేశారు.


ఆ బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది..

రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పైన స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత, యువతకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలపైన మాట్లాడే అర్హత కోల్పోయారని విమర్శించారు. యువత గురించి రాహుల్ గాంధీ చెప్పే ఊకదంపుడు ప్రసంగాలకు భిన్నంగా రేవంత్‌రెడ్డి విద్యార్థులను, ఇంజినీర్లను, టీచర్లను క్రిమినల్ వేస్ట్ అంటున్నారని ప్రస్తావించారు. దేశ ప్రగతికి పాటుపడుతున్న ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? అని ప్రశ్నించారు. తెలంగాణ యువత కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తున్న అడ్డమైన వ్యాఖ్యలను గమనిస్తోందని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులనే కాకుండా ఇంజినీరింగ్ టీచర్లను తప్పుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. యువతపైన, విద్యార్థులపైన అడ్డగోలుగా నోరు పారేసుకోవడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహించారు. తెలంగాణ యువత ఆత్మగౌరవంపైన, ఆత్మవిశ్వాసంపైన రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వార్తలు కూడా చదవండి...

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌-2026 నోటిఫికేషన్ విడుదల

అసెంబ్లీలో విద్వేషపూరిత ప్రసంగాల నిరోధానికి చట్టం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

విశ్రాంత ఐపీఎస్ కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 04:29 PM