విశ్రాంత ఐపీఎస్ కుమార్తెకు అదనపు కట్నం వేధింపులు
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:28 AM
భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను విశ్రాంత ఐపీఎస్ కుమార్తె ఆశ్రయించారు.
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీసులను విశ్రాంత ఐపీఎస్ కుమార్తె ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త కార్తీక్, అత్తింటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి కార్తీక్ అనే వ్యక్తిని 2024 అక్టోబరు 26వ తేదీన వివాహం చేసుకుంది. వివాహ సమయంలో భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర కానుకలు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం అదనపు వరకట్నం కోసం భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తనకు పుట్టింటి నుంచి మరిన్ని డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారని తెలిపింది. వారి డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో తనను అవమానించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News