తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:28 PM
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్, జులై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును (Telangana SIR) మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 10వ తేదీ వరకు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని స్పష్టం చేశారు. ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు తిరిగి ఇవ్వవచ్చని తెలిపారు.
సవరించిన ‘సర్’ షెడ్యూల్
ఎన్యూమరేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10-08-2026
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ: 10-08-2026
ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణ: 17-08-2026
క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: 17-08-2026 నుంచి 16-09-2026 వరకు
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం (నోటీసు కాలం): 17-08-2026 నుంచి 15-10-2026 వరకు
తుది ఓటరు జాబితాల ప్రచురణ: 19-10-2026
వార్తలు కూడా చదవండి...
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News