Home » NIMS
నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఆయనకు బినామీలుగా ఉన్న నిమ్స్ ఉద్యోగుల ఇళ్లల్లో మంగళవారం సోదాలు నిర్వహించి మరిన్ని ఆస్తులను గుర్తించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడి ఇటీవల జైలుపాలైన నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అవినీతిని ఆయన విలాసవంతమైన జీవన విధానమే పట్టించింది.
నిమ్స్‌లో కొంతమంది ఉన్నతాధికారులు, విభాగాల అధిపతులపై తరచూ ఏసీబీ దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది.
లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, అవిగాక పలు అపార్ట్‌మెంట్లలో మరిన్ని ఫ్లాట్లు, స్థలాలు, ఆర్థిక సంస్థల్లో భారీ పెట్టుబడులు, ఖరీదైన కార్లు.. ఓ వైద్యాధికారి ఆస్తుల జాబితా ఇది. వాటి విలువ రూ.100 కోట్లపైనే. నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ కార్యాలయంతోపాటు నివాసాల్లో సోదాలు జరిపినప్పుడు ఏసీబీ అధికారులు కనుగొన్న ఆస్తుల వివరాలు ఇవి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ ఎన్.లక్ష్మీభాస్కర్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిమ్స్ వైద్యులు శనివారం కలిశారు. నిమ్స్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేశ్ రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్‌లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు.