NIMS NEET SS Top Ranks: నిమ్స్ వైద్యులకు నీట్ ఎస్‌ఎస్‌లో ఉత్తమ ర్యాంకులు
ABN , Publish Date - May 05 , 2025 | 04:07 AM
నిమ్స్ వైద్యులు 2024 నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-ఎస్‌ఎస్)లో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. డాక్టర్ జకీర్ హుస్సేన్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించడం విశేషం

అభినందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగరి
హైదరాబాద్ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యువ వైద్యులు ఇటీవల విడుదలైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-సూపర్ స్పెషాలిటీ (నీట్-ఎస్‌ఎస్) 2024 ఫలితాల్లో సత్తా చాటారు. రెండోసారి కూడా జాతీయ స్థాయిలో ఒకరు మొదటి ర్యాంక్ పొందడం విశేషం. నిమ్స్ జనరల్ విభాగానికి చెందిన డాక్టర్ జకీర్ హుస్సేన్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. గత ఏడాదీ మొదటి ర్యాంక్‌ను నిమ్స్ జనరల్ మెడిసిన్ డాక్టరే సాధించారు. మొత్తంగా నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన 12 మంది వైద్యులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించిన వైద్యులు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప నగరి అభినందించారు. ర్యాంకులు సాధించిన వైద్యుల్లో డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1వ ర్యాంక్), డాక్టర్ భానుచంద్ (9వ), డాక్టర్ రోహిత్ (14వ), డాక్టర్ యు సౌమ్య (21వ), డాక్టర్ సయ్యద్ ఖలీలుల్లా (43వ), డాక్టర్ కృష్ణ కిషోర్ సోమాని (50వ), డాక్టర్ వి సాయి స్పూర్తి (58వ), డాక్టర్ ధీరజ్ అనిరుధ్ (67వ), డాక్టర్ అమ్తుల్ రహీం సుర్యమ్ (361వ), డాక్టర్ పీఎస్‌ఎన్ రజిత (420వ), డాక్టర్ ఏవీఎస్ శ్రీలేఖ్య (456వ) ఉన్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన యువ వైద్యులను డీన్ లీజా రాజశేఖర్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సుబ్బలక్ష్మి, సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, ప్రొఫెసర్ రాంమూర్తి, ఇతర వైద్యులు అభినందించారు.