NIMS Hyderabad Death: నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:14 PM
నిమ్స్‌లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఇంటర్నెట్ షిప్ పూర్తవుతుందనుకున్న సమయంలో నితిన్ ఇలా చనిపోవడం సహచరులను షాక్‌కు గురిచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 17: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో (NIMS Hospital) అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న నితిన్‌గా గుర్తించారు. గత రాత్రి (గురువారం) విధులకు హాజరైన నితిన్.. ఇవాళ (శుక్రవారం) ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చనిపోయిన విద్యార్థి నిమ్స్‌లో న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్ అనస్థీషియా టెక్నీషియన్‌గా ఉన్నారు. నిమ్స్‌లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఇంటర్నెట్ షిప్ పూర్తవుతుందనుకున్న సమయంలో నితిన్ ఇలా చనిపోవడం సహచరులను షాక్‌కు గురిచేసింది. బోరబండలోని గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ నిమ్స్‌లో నితిన్ ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. అయితే రాత్రి విధులకు హాజరైన నితిన్ అర్ధరాత్రి కనిపించకుండాపోయాడు. ఉదయానికి ఆపరేషన్ థియేటర్‌లో డోర్ వెనకాల అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు నితిన్. నితిన్‌ను గమనించిన హౌస్ కీపింగ్ సిబ్బంది వెంటనే నిమ్స్ సిబ్బందికి తెలియజేశారు.
ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఘటనా స్థలి నుంచి తరలించారు. కాజ్ ఆఫ్ డెత్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడం మొదలుపెట్టారు. నితిన్ ఆఖరి సారిగా ఎవరితో మాట్లాడాడు అనే దానిపై అతడి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నితిన్ మృతిపై నిమ్స్ యాజమాన్యం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు పూర్తిగా సహకారం అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఇక నితిన్ మృతితో తోటి విద్యార్థులు, సీనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్
బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
Read Latest Telangana News And Telugu News