Share News

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

ABN , Publish Date - Aug 05 , 2026 | 09:35 AM

కల్తీ మసాలా దినుసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
Masala Adulteration

హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కల్తీ మసాలా దినుసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఆయా పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపడుతుందని స్పష్టం చేసింది. మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.


ఇప్పటికే కల్తీ తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్న రాహూల్ భట్టీ, విశాల్ పన్వర్, దూల్ చంద్ కచ్చావర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మసాలాలను మెరిపించేందుకు విషపూరిత రసాయనాలను నిందితులు వాడుతున్నారు. బట్టలకు ఉపయోగించే రంగులు, టాల్కంపౌడర్, సింథటిక్ పౌడర్లను ఉపయోగించి నాసిరకం మసాలాలను ఈ ముఠా తయారు చేస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి సెకండ్ గ్రేడ్, నాసిరకం మసాలాలను కొనుగోలు చేసి రంగులు అద్ది మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు అంతర్రాష్ట్ర ముఠాలతో ఉన్న సంబంధాలపై సిట్ ఫోకస్ చేయనుంది. కల్తీ మూలాలు, నిందితుల నెట్‌వర్క్‌ను సిట్ ఛేదించనుందని తెలంగాణ సర్కార్ పేర్కొంది.


వార్తలు కూడా చదవండి...

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 09:49 AM