జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:34 PM
తెలంగాణకు 150 కొత్త జీసీసీలు 20 నెలల్లో రానున్నాయని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. జీసీసీలతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు 150 కొత్త జీసీసీలు 20 నెలల్లో రానున్నాయని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. జీసీసీలతో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు (గురువారం) జేఎల్‌ఎల్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను జీసీసీ హబ్‌గా జేఎల్‌ఎల్ ఎంచుకుందని వెల్లడించారు. జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్ అని వివరించారు. ఏఐ, డీప్‌టెక్ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని ఉద్ఘాటించారు. జాతీయ జీసీసీ లీజింగ్‌లో హైదరాబాద్ వాటా 16 శాతం ఉందని చెప్పుకొచ్చారు.
జీసీసీల విస్తరణలో వేగం పెరిగింది..
హైదరాబాద్ కార్యాలయ లీజింగ్‌లో జీసీసీల వాటా 42శాతమని మంత్రి తెలిపారు. హెల్త్‌కేర్, బయోటెక్, సెమీకండక్టర్లకు హైదరాబాద్ తొలి ఎంపిక అని వివరించారు. జేఎల్‌ఎల్ జీసీసీతో రెండేళ్లలో 1,600 ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణ కేంద్రమని వెల్లడించారు. ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీతో పెట్టుబడులకు కొత్త ఊపు వస్తోందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధితో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జీసీసీల విస్తరణలో వేగం పెరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News