వాటర్ ట్యాంక్‌లో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
ABN , Publish Date - Jul 27 , 2026 | 02:31 PM
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ వాటర్ ట్యాంక్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే..
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ వాటర్ ట్యాంక్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే.. వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌దేవ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహర్కి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నీటిలోకి దూకిన నలుగురిలో జస్రాద్ అనే వ్యక్తి కేకలు వేయడం గమనించి కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడకు పరుగెత్తుకెళ్లారు. కానీ చెరువు దగ్గరికి చేరుకునేసరికే వారంతా నీటిలో మునిగిపోయారు. స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మృతులను జుగ్‌తారామ్ సుతార్ కుమారుడు జస్రాజ్ సుతార్(29), భార్య నిర్మ సుతార్(25), వారి పదేళ్ల కుమారుడు భరత్, ఐదేళ్ల కుమార్తె మనీషాగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నివేదిక, దర్యాప్తు పూర్తయ్యాక ఘటనకు గల కచ్చితమైన వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ