విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:48 PM
రెండు రోజుల క్రితం 'బిహార్ బంద్' సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఓ పోలీసు 'ఏకే-47' తో కాల్పులు జరపడంపై అధికారులు సీరియస్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు రోజుల క్రితం 'బిహార్ బంద్' సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఓ పోలీసు సిబ్బంది'ఏకే-47' (AK-47) రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
ఈనెల 25న బిహార్‌లో విద్యార్థి సంఘాలు చేపట్టిన 'బిహార్ బంద్' సందర్భంగా పలు జిల్లాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడకు బుల్లెట్ తగిలిందని కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తూ... కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోను నెట్‌లో షేర్ చేశాడు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఢిల్లీలో నిరసన తెలిపే విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు, బిహార్‌లో ఏకే-47లు ప్రయోగిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై సాధించిన నా విజయం కార్గిల్ వీరులకు అంకితం: జాదుమణి
వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్